![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ కొత్త సీజన్ హడావిడి అంతా ఇంతా కాదు. చాలా బ్రాండ్స్ ఈ బిగ్ బాస్ తో జతకడుతున్నాయి. మొన్నటి వరకు వైట్ గోల్డ్ లాస్ట్ ఛాన్స్ అన్నారు. ఛాన్స్ మిస్ చేసుకున్న వాళ్లంతా ఆడిషన్ వీడియోస్ ని అప్ లోడ్ చేసుకోండి అన్నారు. ఇక ఇప్పుడు కూడా మరో ఛాన్స్ ఇచ్చారు మరో ప్రోడక్ట్ తో. అదే గోల్డ్ డ్రాప్ బ్రాండ్ ఫైనల్ ఛాన్స్ . దీనికి నవదీప్ వచ్చి ఈ ఛాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ ప్రోమో ఇప్పుడువైరల్ అవుతోంది.
"బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేయడానికి మీకిదొక చివరి ఛాన్స్. మీ దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్ కి వెళ్లి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ స్పెషల్ గా మార్క్ చేసిన ప్యాకెట్స్ ని గుర్తించండి. దాని పైన ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీ ఆడిషన్ ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపెంట్ మీరే అవ్వొచ్చు. గోల్డ్ డ్రాప్ ఎందుకంటే కొన్ని గోల్డెన్ ఛాన్సెస్ అస్సలు డ్రాప్ చేయకూడదు." అని చెప్పాడు నవదీప్.
.webp)
చాలామంది కొత్త కంటెస్టెంట్స్ కూడా వీటికి ట్రై చేస్తున్నారు. ఐతే వెళ్లిన వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ గురించి ఎన్నో కామెంట్స్ చేశారు. అలాగే రీసెంట్ గా ఆనందం మూవీ హీరోయిన్ రేఖ కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడారు. బిగ్ బాస్ కి వెళ్ళాలి కెమెరా ముందు నిలబడి అంత మందితో పోటీ పడి టాస్కులు ఆడాలంటే చాలా ధైర్యం ఉండాలి. గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను కానీ కంటెస్టెంట్ గా అంటే కష్టమే అనేసింది. మరి ఇప్పుడు రేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నాటి హీరోయిన్. ఎలాగో గత సీజన్స్ లో ఆశా సైని, సంజన గల్రాని, ముమైత్ ఖాన్, షకీలా వంటి సీనియర్ నటీమణులంతా వెళ్లారు. మరి రేఖని కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
![]() |
![]() |